వేడి వేడి చికెన్ అంతరిక్షంలో కూడా!!

అంతరిక్ష కేంద్రంలో వేడివేడి చికెన్ వింగ్స్ ను ఎలాంటి పొగరాని ప్రత్యేక ఓవెన్ లో వండుకుని చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు.

Update: 2025-11-05 11:28 GMT

అంతరిక్ష కేంద్రంలో వేడివేడి చికెన్ వింగ్స్ ను ఎలాంటి పొగరాని ప్రత్యేక ఓవెన్ లో వండుకుని చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోని ఓ ప్రైవేట్ స్పేస్ స్టేషన్లో ఇలా ఓవెన్లో చికెన్ ను వండుకుని తినడం, అంతరిక్ష కేంద్రంలో వంటచేయడం కూడా ఇదే ప్రప్రథమం. స్పేస్ కిచెన్ సాంకేతికతను చైనా విజయవంతంగా పరీక్షించింది. వేడివేడి చికెన్ ను వ్యోమగాములంతా తిన్నారు. తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో చికెన్ ను వండుకున్నారు. అతిశీతల ఆహార పదార్థాలకు మళ్లీ వేడి చేసి తినడానికి బదులుగా అప్పుడే వండిన వేడివేడి ఆహారం తినాలనే ఆశ నుంచి హాట్-ఎయిర్ ఓవెన్ ఆలోచన పుట్టుకొచ్చింది. ఈ ఓవెన్ ను ఇటీవల షెంజువాన్-21 వ్యోమనౌక ద్వారా భూమి నుంచి తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. తాజాగా దీనిని చికెన్, మటన్ ముక్కలను బేక్ చేసి పరీక్షించారు. భారరహిత స్థితిలో పొగ కమ్మితే అది పోదు. దాంతో వ్యోమగాముల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వంటలను వండినప్పుడు పొగ వెలువడకుండా ఓవెన్లో ప్రత్యేక ఏర్పాటుచేశారు. బహుళ పారల ఫిల్టర్లను దానిలో అమర్చారు.

Tags:    

Similar News