నన్ను ఆదుకోండి: నటి పాకీజా
నటి పాకీజా అలియాస్ వాసుకి అనేక తెలుగు, తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
నటి పాకీజా అలియాస్ వాసుకి అనేక తెలుగు, తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాను చాలా కష్టాల్లో ఉన్నానని తనను ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. తమిళ సినీ పరిశ్రమ తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను ఆదుకోవాలని, పింఛన్ డబ్బులు వచ్చేలా చేయాలని కోరింది. తన వద్ద ఉన్న డబ్బు అంతా తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసమే ఖర్చు చేశానని, ప్రస్తుతం తన చేతుల్లో సినిమాలు కానీ, సీరియళ్లు కానీ లేవని వివరించింది. నటి పాకీజా కన్నీటి పర్యంతం అవుతూ వీడియోను విడుదల చేశారు.