హీలియం గ్యాస్ గుంటూరులో పుట్టిందే
హీలియం గ్యాస్.. మనం బెలూన్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. ఈ గ్యాస్ ను కనిపెట్టింది గుంటూరులోనే!
హీలియం గ్యాస్.. మనం బెలూన్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. ఈ గ్యాస్ ను కనిపెట్టింది గుంటూరులోనే! ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త పియరీ జాన్సన్ 157 ఏళ్ల క్రితం సూర్యగ్రహణం రోజున ప్రయోగం చేసి ఈ గ్యాస్ ను కనుగొన్నారు. హీలియం గాలి కంటే తేలికైనది. రంగు, రుచి, వాసన లేని, విషపూరితం కాని తటస్థమైన ఒకే అణువు కలిగిన రసాయన మూలకం. భూమిపై అరుదుగా, విశ్వంలో హైడ్రోజన్ తర్వాత ఎక్కువగా లభిస్తుంది. అప్పట్లో సూర్యుని ఉపరితలాన్ని గ్రహణం రోజు మాత్రమే చూడగలమనే భావన ఉండేది. 1868 ఆగస్టు 18 నాటి సంపూర్ణ సూర్యగ్రహణ మార్గంలో మన దేశం ఉంది. ప్రయోగాలు చేసేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి పలువురు శాస్త్రవేత్తలు భారత్ కు వచ్చారు. అలా వచ్చిన పియరీ గుంటూరులో ఓ ఫ్రెంచ్ వ్యాపారికి చెందిన ఎత్తయిన భవనంపై ప్రయోగాలు చేసి హీలియాన్ని కనుగొన్నారు. ఆయన ఆ రోజు సూర్యగ్రహణాన్ని గమనిస్తూ క్రోమోస్పియర్లో పసుపు వర్ణపట ఉద్గారాన్ని గుర్తించారు. ఆ క్రోమోస్పియర్ వాయురూపంలో ఉందని చూపి, హీలియాన్ని ఆవిష్కరించారు.