4 కిలోమీటర్ల దూరమైనా కాల్చేస్తాడు.. ఏఐ హెల్ప్ తో!!

13,000 అడుగులు, అంటే దాదాపు 4 కిలోమీటర్ల దూరం.. మనకు కనిపించడమే కష్టం

Update: 2025-08-18 10:30 GMT

13,000 అడుగులు, అంటే దాదాపు 4 కిలోమీటర్ల దూరం.. మనకు కనిపించడమే కష్టం, అలాంటిది రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన ఓ స్నైపర్ ఏకంగా అంత దూరం నుండి రష్యా సైనికుడిని గురితప్పకుండా కాల్చి చంపి చరిత్ర సృష్టించాడు. ఈ విషయాన్ని కీవ్‌పోస్ట్ పత్రిక అధికారికంగా ప్రకటించింది. పొక్రొవొస్క్‌ ప్రాంతంలో ఆగస్టు 14న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. 'ఎలిగేటర్ 14.5 ఎంఎం' రైఫిల్‌తో ఈ స్నైపర్ ఇద్దరు రష్యా సైనికులను మట్టుబెట్టాడు. ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. గతంలో అత్యంత దూరం నుంచి లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు కూడా ఉక్రెయిన్ సైనికుడి పేరిటే ఉంది. 12,400 అడుగుల దూరం నుంచి ఓ రష్యా సైనికుడిని హతమార్చగా, తాజాగా ఆ రికార్డు బద్దలైంది.

Tags:    

Similar News