పనే చేయలేదు 28 లక్షలు జీతం తీసుకున్నాడు
12 ఏళ్లపాటు డ్యూటీ చేయకుండానే ఏకంగా 28 లక్షల రూపాయల జీతం అందుకున్నాడు.
Madhya pradesh
12 ఏళ్లపాటు డ్యూటీ చేయకుండానే ఏకంగా 28 లక్షల రూపాయల జీతం అందుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2011లో ఓ వ్యక్తి కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాడు. భోపాల్ పోలీస్ లైన్స్‌లో పోస్టింగ్ సైతం ఇచ్చారు. కొన్ని రోజులకే ఆ బ్యాచ్‌లో మిగతా వారితో కలిపి అతడిని కూడా సాగర్ పోలీస్ ట్రెయినింగ్ సెంటర్‌కు ప్రాథమిక శిక్షణ కోసం పంపించారు. అతడేమో ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లకుండా, విదిశలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. తన సర్వీస్ ఫైల్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా భోపాల్‌కు పంపాడు. ఆ ఫైల్ ఎటువంటి దర్యాప్తు లేకుండానే ఆమోదం పొందింది. అతను జీతం పొందుతూనే ఉన్నాడు. ఎప్పుడూ అతడు విధులకు హాజరు కాలేదని, 12 సంవత్సరాలుగా ఏ అధికారి కూడా గుర్తించలేదు.
2011వ బ్యాచ్ వారికి పే గ్రేడ్ ఎవాల్యుయేషన్ సమయంలో అతడిని గురించి వాకబు చేయగా తామెన్నడూ చూడలేదని, ఎక్కడ పనిచేస్తున్నాడో తెలియదని చెప్పడంతో అధికారులు షాకయ్యారు. దీంతో కానిస్టేబుల్‌కు నోటీసులు పంపగా తనకు మానసిక సమస్యలున్నాయంటూ, ఆధారాలను సమర్పించాడు.