తల్లికి వందనం పడలేదని టవర్ ఎక్కి మరీ
తల్లికి వందనం డబ్బులు పడలేదని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన కోరుపల్లి శ్యామ్ విద్యుత్ టవర్ ఎక్కాడు.
తల్లికి వందనం డబ్బులు పడలేదని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన కోరుపల్లి శ్యామ్ విద్యుత్ టవర్ ఎక్కాడు. శ్యామ్, సునీత దంపతులకు ఇద్దరు పిల్లలు. ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు వేయకపోవడంతో అధికారులను అడిగాడు. కొద్దిరోజులు ఎదురుచూడాలని చెప్పాడు. అయినప్పటికీ డబ్బులు రాకపోవడంతో శ్యామ్ గరగపర్రులోని హెచ్‌టీ విద్యుత్ టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. పోలీసులు వెళ్లి శ్యామ్‌ను టవర్ దిగాలని కోరారు. శ్యామ్ వినకపోవడంతో అతని భార్యతో నచ్చజెప్పించి కిందకు దిగేలా చేశారు.