హ్యాండ్ శానిటైజర్లతో క్యాన్సర్ ముప్పు
హ్యాండ్ శానిటైజర్.. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ఎంతో మంది దీనిని వినియోగించారు.
హ్యాండ్ శానిటైజర్.. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ఎంతో మంది దీనిని వినియోగించారు. వీటి తయారీలో ప్రధాన ముడిపదార్థమైన ఇథనాల్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. దీంతో ఇథనాల్‌ను నిషేధించాలని యూరోపియన్ యూనియన్ యోచిస్తోంది. యూరోపియన్ కెమికల్స్ ఏజెన్సీ పరిధిలోని వర్కింగ్ గ్రూపులలో ఒకటి ఇథనాల్‌ను ప్రమాదకర వస్తువుగా నిర్ధారిస్తూ అక్టోబర్ 10న అంతర్గత సిఫార్సు చేసింది. క్యాన్సర్ ముప్పు, గర్భిణులకు ఆరోగ్య సమస్యలు ఇథనాల్ వల్ల పెరిగే ప్రమాదం ఉందని ఆ గ్రూపు తన నివేదికలో హెచ్చరించింది. వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగీలను అత్యంత సమర్థంగా సంహరించడంలో ఇథనాల్‌కు గుర్తింపు ఉంది. శానిటైజర్లలో దీన్ని ఉపయోగించడమే కాకుండా ఆసుపత్రులలో కూడా దీని వాడకం అధికంగా ఉంది.