తక్కువ ధరకే.. ఏసీలు, టీవీలు

వస్తు సేవల పన్నులో శ్లాబుల తగ్గింపుతో ఏసీలు, టీవీల ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరానున్నాయి.

Update: 2025-08-19 11:15 GMT

వస్తు సేవల పన్నులో శ్లాబుల తగ్గింపుతో ఏసీలు, టీవీల ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరానున్నాయి. ఎయిర్‌ కండీషనర్లపై 28 శాతంగా ఉన్న జీఎస్‌టీ 18 శాతానికి తగ్గనుంది. మోడల్‌ను బట్టి ఒక్కో ఏసీ యూనిట్‌ ధర 1500 నుండి 2500 రూపాయల మేర చౌకగా మారనుంది. 32 అంగుళాలకు మించిన టీవీలపై జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం 12 శాతం, 28 శాతం జీఎస్టీ శ్లాబ్‌లను రద్దు చేసి, కేవలం 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లను కొనసాగించే ఆలోచనలో కేంద్రం ఉంది. 28 శాతం కేటగిరీలో ఉన్న దాదాపు 90 శాతం వస్తువులను 18 శాతానికి మార్చనున్నారు. అలాగే 12 శాతం శ్రేణిలో ఉన్న ఎక్కువ వస్తువులను 5 శాతానికి తేవాలని యోచిస్తున్నారు.

Tags:    

Similar News