భారతీయులకు గోల్డెన్ వీసా.. ఎంత ఖర్చు చేయాలంటే?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించింది. నామినేషన్ విధానంలో ఈ వీసాను జారీ చేయనుంది. లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు అంటే సుమారు 23 లక్షల రూపాయలు ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తుంది. ఇంతకు ముందు దుబాయ్‌లో గోల్డెన్ వీసా పొందాలనుకునే భారతీయులు 4.66 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి ఉండాలి. లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి ఉండాలి. ఇకపై కేవలం ఫీజుతోనే వీసాను అందజేయనున్నారు. ఈ కొత్త వీసాకు సంబంధించింది వచ్చే మూడు నెలల్లో 5 వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నది దుబాయ్ ప్రభుత్వ వర్గాల అంచనా వేస్తోంది. ఈ పథకం పైలట్ ప్రాజెక్టు కోసం భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌ను ఎంపిక చేసింది.