బంగారం.. తగ్గుతుందట
బంగారం ధరలు కాస్త దిగివచ్చే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది.
బంగారం ధరలు కాస్త దిగివచ్చే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. అమెరికా డాలర్ బలోపేతం అయినా, ట్రెజరీ రాబడులు పెరిగినా కూడా పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం తప్పదని అన్నారు. ఔన్సు మేలిమి బంగారానికి 2022 నవంబరు నాటి కనిష్ఠ ధర 1429 డాలర్లు కాగా, ప్రస్తుతం 3300 డాలర్లకు చేరింది. ఇప్పుడిప్పుడే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు వాణిజ్య ఒప్పందాలు కూడా కొలిక్కి వచ్చే పరిస్థితులు ఉండడంతో బంగారంపై పెట్టుబడులు తగ్గొచ్చని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. దీర్ఘకాలంలో పసిడి ధరలు దిగిరావాలంటే మరిన్ని సంస్థాగత మార్పులు అవసరమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.