10 లక్షలకు గిర్ ఆవు.. ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందంటే?
పాడి పరిశ్రమలో గిర్ ఆవులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
Gir cow
పాడి పరిశ్రమలో గిర్ ఆవులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఆవులను కొనడానికి ఎగబడుతూ ఉంటారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురంలో గుమ్మి రామిరెడ్డి కి చెందిన వ్యవసాయ క్షేత్రం లోని గిర్ జాతి ఆవుకు భారీ ధర పలికింది. సత్యసాయి జిల్లాలోని పెనుగొండకు చెందిన హెబ్బేవ్ గోశాల నిర్వాహకుడు 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. రామిరెడ్డి నాలుగున్నరేళ్ల క్రితం గుజరాత్లోని రాజ్ కోట్నుంచి రెండు గిర్ జాతి ఆవులను తెప్పించి గోశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 132 గిర్ ఆవులున్నాయి. ఈ ఆవు ఉదయం, సాయంత్రం 8 లీటర్ల చొప్పున మొత్తం 16 లీటర్లు పాలు ఇస్తుంది. ఈ ఆవును వాహనంలో తరలించారు.