అయోధ్య రామయ్యకు ఛార్టర్డ్‌ విమానంలో వచ్చిన బహుమతులు

అయోధ్య రామయ్యకు భారీగా విరాళాలు అందుతూనే ఉన్నాయి.

Update: 2025-06-07 11:00 GMT

అయోధ్య రామయ్యకు భారీగా విరాళాలు అందుతూనే ఉన్నాయి. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేశ్‌ పటేల్‌ అయోధ్య ట్రస్టుకు వజ్రాలు పొదిగిన 11 కిరీటాలు, బంగారు విల్లంబులు విరాళంగా ఇచ్చారు.


వజ్రాలు, 30 కిలోల వెండి, 300 గ్రాముల బంగారం, కెంపులు వీటిలో ఉన్నాయి. కంఠహారాలు, చెవి రింగులు, నుదుటి తిలకాలు అందించారు. ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో వీటిని అయోధ్యకు తీసుకొచ్చారు. ఇక అయోధ్య రామాలయ నిర్మాణంలో మొత్తం 45 కిలోల స్వచ్ఛమైన బంగారం వినియోగించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర తెలిపారు.

Tags:    

Similar News