రోడ్డుపై ప్రత్యక్షమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను న్యూయార్క్ నగర పోలీసులు నడిరోడ్డుపై అడ్డుకున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను న్యూయార్క్ నగర పోలీసులు నడిరోడ్డుపై అడ్డుకున్నారు. ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుంచి ఫ్రెంచ్ ఎంబసీకి మాక్రాన్ కాలినడకన బయలుదేరారు. ఈ క్రమంలో, భద్రతా సిబ్బంది ఆయన్ను మధ్యలోనే నిలిపివేశారు. అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా అన్ని దారులను మూసివేస్తున్నామని, ముందుకు వెళ్లడానికి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. ఈ అనూహ్య పరిణామంపై మాక్రాన్ సరదాగా స్పందించారు. వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కే ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. మీ కాన్వాయ్ కోసం ఇక్కడ నన్ను నడిరోడ్డుపై ఆపేశారు. నేను న్యూయార్క్ వీధిలో నిలబడి ఎదురుచూస్తున్నానని ఆయన ఫోన్‌లో ట్రంప్‌తో అన్నారు. దీనికి ట్రంప్ కూడా స్పందిస్తూ, తాను కూడా ఫ్రెంచ్ ఎంబసీ వైపే వస్తున్నానని బదులిచ్చారు. కొంత సమయం తర్వాత పాదచారులను అనుమతించడంతో మాక్రాన్ తన ప్రయాణాన్ని కొనసాగించారు.