భార్యను గెలిపిస్తే కటింగ్, షేవింగ్ ఫ్రీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి చాలా వెరైటీ ఆఫర్ ఇవ్వడం విశేషం. తన భార్యను వార్డ్ మెంబర్‌గా గెలిపిస్తే ఆ వార్డ్‌లోని ప్రజలకు 5 సంవత్సరాలు ఉచిత కటింగ్ అంటూ ఆఫర్ ప్రకటించాడు. దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో శివాని అనే మహిళ గ్రామ వార్డు మెంబర్‌గా పోటీ చేస్తున్నారు. తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే, వార్డులోని ప్రజలకు ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్, షేవింగ్ చేస్తానని ప్రకటించారు ఆమె భర్త శ్రీకాంత్.