భారత సైన్యం లోకి ఎగిరే యుద్ధ ట్యాంకర్

భారత సైన్యంలోకి అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ ఏహెచ్‌–64ఈ అటాక్‌ హెలికాప్టర్లు చేరనున్నాయి.

Update: 2025-07-22 13:15 GMT

భారత సైన్యంలోకి అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ ఏహెచ్‌–64ఈ అటాక్‌ హెలికాప్టర్లు చేరనున్నాయి. మొదట మూడు హెలికాప్టర్లను మంగళవారం ఇండియన్‌ ఆర్మ్ కి చెందిన ఏవియేషన్‌ విభాగానికి అప్పగించబోతున్నారు. మొత్తం ఆరు హెలికాప్టర్ల కొనుగోలుకు 2020లో అమెరికాతో ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ విలువ 5000 కోట్లకు పైనే. 2024 జూన్‌ నెలలో మొదటి దశ హెలికాప్టర్లను అప్పగించాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. ఇక రెండో దశ హెలికాప్టర్లు ఈ ఏడాది ఆఖరు నాటికి రాబోతున్నాయి. అపాచీ ఏహెచ్‌–64ఈ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో కీలకం కాబోతున్నాయి. పాకిస్తాన్‌ సరిహద్దుల్లో వీటిని మోహరించబోతున్నారు. 2015లో కుదిరిన మరో ఒప్పందం కింద భారత సైన్యం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను సమకూర్చుకుంది. దీన్ని ఎగిరే యుద్ధ ట్యాంకర్ అని కూడా అంటారు.

Tags:    

Similar News