ఫిట్ నెస్ టెస్టుల ఫీజులు భారీగా!!

పాత వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా పది రెట్లకు పైగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

Update: 2025-11-19 11:37 GMT

పాత వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా పది రెట్లకు పైగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా వాహనాలకు 10-15 ఏళ్లు, 15-20 ఏళ్లు, 20 ఏళ్లకు పైబడిన వాహనాలు అనే మూడు కేటగిరీలను ప్రవేశపెట్టారు.

20 ఏళ్లకు పైబడిన ట్రక్కులు లేదా బస్సులకు ఫిట్‌నెస్ టెస్టింగ్ కోసం ఇప్పటివరకు 2,500 రూపాయలు ఉండగా, దాన్ని ఏకంగా 25,000 రూపాయలకు పెంచారు. వ్యక్తిగత వాహనాలకు సంబంధించి 20 ఏళ్లకు పైబడిన తేలికపాటి మోటారు వాహనాలకు ఫీజును 15,000గా నిర్ణయించారు. 20 ఏళ్లు పైబడిన త్రీ వీలర్ వాహనాలకు 7,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 20 ఏళ్లకు పైబడిన ద్విచక్ర వాహనాలకు గతంలో 600 రూపాయలు ఫీజుగా ఉండగా, ఈ ఫీజు ఇప్పుడు 2,000 రూపాయలకి చేరింది. 15 ఏళ్లలోపు వాహనాలకు సైతం ఫీజులు పెరిగాయి. మోటార్ సైకిళ్లకు 400, తేలికపాటి మోటారు వాహనాలకు 600, మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలకు 1,000 రూపాయల చొప్పున ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ ఫీజు వసూలు చేయనున్నారు.

Tags:    

Similar News