చిరుతతో పోరాటం.. చివరికి విజయం!!
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇటుక బట్టి కార్మికులపై చిరుతపులి దాడి చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇటుక బట్టి కార్మికులపై చిరుతపులి దాడి చేసింది. చిరుత పులికి చిక్కిన ఓ యువకుడు మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి వీరోచిత పోరాటం చేశాడు. ధౌర్‌పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జుగ్నుపూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇటుక తయారీ కేంద్రంలో చిరుతపులి సంచరించింది. ఆ సమయంలో 35 ఏళ్ల మిహిలాల్ అనే కార్మికుడు ప్రాణాలకు తెగించి చిరుతపులితో హోరాహోరీగా పోరాడాడు. చిరుతను కిందపడేసి, దాని నోటిని గట్టిగా పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశాడు. మిహిలాల్ చిరుతతో తలపడడం గమనించిన తోటి కార్మికులు, సమీపంలోని గ్రామస్థులు ఇటుకలు, రాళ్లతో చిరుతపులిపై దాడి చేశారు. దీంతో చిరుతపులి సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి పారిపోయింది. అటవీశాఖ అధికారులు చిరుతపులికి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు.