72 కోట్ల ఆస్థిని రాసిచ్చినా.. అభిమాని కుటుంబానికే
అభిమానుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకం ఉంటారు. తాము అభిమానించే వ్యక్తికి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు.
అభిమానుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకం ఉంటారు. తాము అభిమానించే వ్యక్తికి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అలా ఓ అభిమాని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఏకంగా 72 కోట్ల రూపాయల ఆస్థిని ఇచ్చేసింది. అయితే ఆ ఆస్థిని సంజూ ఉంచుకోలేదు.
72 కోట్ల ఆస్తిని తిరిగి ఇచ్చేశానని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు గతంలో ఒక అభిమాని ఇచ్చిన కోట్ల ఆస్తిని వారి కుటుంబానికి తిరిగి ఇచ్చానన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న నిషా పటేల్ అనే అభిమాని అప్పట్లో తన ఎస్టేట్ మొత్తాన్ని సంజయ్ దత్ పేరు మీద రాశారు. ఆమె మరణించిన తర్వాత తన సంపద సంజయ్ దత్‌కు దక్కేలా వీలునామా రాశారు. సంజయ్ దత్‌కు అందేలా చూడాలని బ్యాంకులకు కూడా ఆమె సూచించారు. ఈ విషయంపై సంజయ్ దత్ మాట్లాడుతూ, ఆ ఆస్తిని ఆమె కుటుంబ సభ్యులకే ఇచ్చేశానన్నారు.