ఎంచక్కా.. ఫుట్ బాల్ ఆడేస్తున్న రోబోలు
రోబోలు చిన్న చిన్న పనులే కాదు ఫుట్ బాల్ కూడా ఆడగలమని నిరూపించుకున్నాయి.
రోబోలు చిన్న చిన్న పనులే కాదు ఫుట్ బాల్ కూడా ఆడగలమని నిరూపించుకున్నాయి. ఇదంతా చైనా పరిశోధకుల వల్లే సాధ్యమైంది. మనుషులను పోలిన రోబోలు అడ్వాన్స్‌డ్ విజువల్ సెన్సార్ల సాయంతో బంతిని గుర్తించడంతో పాటు మైదానంలో తమ చురుకైన కదలికలతో ఆకట్టుకున్నాయి. కిందపడినా మళ్లీ మనుషుల్లా పైకి లేవడం, మానవుల సాయం లేకుండా పూర్తి ఏఐ ఆధారిత సాంకేతికతతో ముందుకు కదలడం లాంటివి ఈ మ్యాచ్ లో భాగమయ్యాయి. ఆటల్లో గాయపడిన రోబోలను స్ట్రెచర్ల సాయంతో సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. త్వరలో జరిగే ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ పోటీలకు ట్రైలర్ లాగా చైనా రాజధాని బీజింగ్‌లో ఈ పోటీలు జరిగాయి. బూస్టర్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన నాలుగు హ్యూమనాయిడ్ రోబోట్ జట్లు ఈ పోటీల్లో భాగమయ్యాయి.