ఎమోషనల్ స్టోరీ.. విజయం అక్కకు అంకితం చేసిన ఆకాష్ దీప్

ఇంగ్లండ్‌పై భారత జట్టు చారిత్రక టెస్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు ఆకాష్ దీప్.

Update: 2025-07-07 09:15 GMT

ఇంగ్లండ్‌పై భారత జట్టు చారిత్రక టెస్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు ఆకాష్ దీప్. అయితే తన గుండెల్లో దాచుకున్న భారాన్ని మ్యాచ్ అనంతరం పంచుకున్నాడు. తన సోదరి క్యాన్సర్‌తో పోరాడుతోందని ప్రపంచానికి వెల్లడించి అందరినీ భావోద్వేగానికి గురిచేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన చిరస్మరణీయ విజయాన్ని తన సోదరికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ విషయం తాను ఎవరికీ చెప్పలేదని, తన అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోందన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. నా ప్రదర్శన చూసి అందరికంటే తనే ఎక్కువ సంతోషిస్తుందని తాను అనుకుంటున్నానన్నారు. ఈ మ్యాచ్‌ను ఆమెకే అంకితం ఇస్తున్నా. ఆమె ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటున్నానని చెప్పి అందరినీ ఎమోషనల్ చేశాడు ఆకాష్ దీప్. ఇది నీకోసమే.. నేను బంతిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారీ నీ ముఖమే నా మదిలో మెదిలింది. మేమంతా నీతోనే ఉన్నామని అక్కకు ఆకాష్ దీప్ ధైర్యం చెప్పాడు.

Tags:    

Similar News