డ్రైవర్ ఫ్రెండ్లీ.. ఆవలిస్తే అలర్ట్ చేసేలా!
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఎదురుగా రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్నా
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఎదురుగా రోడ్డుపై ప్రమాదం పొంచి ఉన్నా, డ్రైవర్ అప్రమత్తంగా లేక ప్రమాదానికి కారణం అయ్యేలా ఉన్నా, డ్రైవర్ ఆవలించినా ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అప్రమత్తం చేసిన తర్వాత కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ ద్వారా మరోసారి అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ మానిటరింగ్ సిస్టం, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అలర్ట్ సిస్టం అనే ఈ రెండింటితో కూడిన వ్యవస్థ కృత్రిమ మేధ ఆధారంగా పని చేస్తుంది. ప్రయోగాత్మకంగా తొలుత 200 బస్సుల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలను విశ్లేషించిన తర్వాత అన్ని దూరప్రాంత సర్వీసుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.