ఒక్క రూపాయికి ఏమొస్తుందని అనుకోకండి.. న్యాయ సలహా లభిస్తుంది
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఆదర్శ్ ఓ గొప్ప ఆలోచన చేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఆదర్శ్ ఓ గొప్ప ఆలోచన చేశారు.లా చదువుతున్న ఆదర్శ్ పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే ఆలోచనతో 9 మంది స్నేహితులతో కలిసి సీఎల్‌ఎన్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌ను రూపొందించారు. అంతేకాకుండా 2025 మేలో సెంట్రలైజ్డ్ లీగల్ నెట్‌వర్క్ సొల్యూషన్స్ యాప్‌ను కూడా తీసుకొచ్చారు. ఇందులో ఒక రూపాయి చెల్లించి.. న్యాయసేవలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులను ఇందులో భాగస్వామ్యం చేశారు. ఇప్పటివరకు 3 వేల మందికిపైగా సాయం అందించారు. సీఎల్‌ఎన్‌ఎస్ యాప్‌లో రిజిస్టర్ చేసుకొని, లాగిన్ కావడం ద్వారా సేవలు పొందొచ్చు.