అక్కడకు వెళ్ళకండి అయ్యప్ప భక్తులకు సూచన
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులు ఆలయం సమీపంలోని ఉరళ్‌కుళి జలపాతాన్ని సందర్శించవద్దని కేరళ అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులు ఆలయం సమీపంలోని ఉరళ్‌కుళి జలపాతాన్ని సందర్శించవద్దని కేరళ అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయని, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని వెళ్లవద్దని సూచించారు. అయ్యప్ప సన్నిధానానికి అటవీ మార్గం గుండా వెళ్లే కొందరు భక్తులు ఉరళ్‌కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వామిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఈ ప్రాంతంలోకి ప్రవేశం పూర్తిగా నిషేధించబడిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఎక్కువగా సంచరిస్తూ ఉంటుందని అధికారులు తెలిపారు.