988 కోట్ల ఖర్చుతో దేశీయ చాట్ బాట్
ప్రస్తుతం చాట్‌జీపీటీ, జెమినీ, గ్రాక్, పర్‌ఫ్లెక్సిటీ లాంటి చాట్ బాట్స్ ను తెగ వినియోగిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం చాట్‌జీపీటీ, జెమినీ, గ్రాక్, పర్‌ఫ్లెక్సిటీ లాంటి చాట్ బాట్స్ ను తెగ వినియోగిస్తూ ఉన్నారు. విదేశీ సంస్థలకు చెందిన ఈ ఏఐ టూల్స్ ను మించేలా స్వదేశీ ఏఐ చాట్‌బాట్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘భారత్‌జెన్’ అనే పేరు ఉన్న చాట్ బాట్ పౌరసేవలు, విద్య, వైద్యం, వాణిజ్యరంగాలకు ఉపయుక్తంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వమే ఈ కార్యాచరణ మొదలు పెట్టింది. దీనిపై 988 కోట్లు ఖర్చు చేయనుంది. ఐఐటీ బాంబే ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తుండగా హైదరాబాద్, మద్రాస్, మండి, కాన్పుర్ ఐఐటీలు, ఇండోర్ ఐఐఎం భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. రెండేళ్లలో ఈ దేశీయ చాట్‌బాట్‌ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.