డాగ్ బాబు సన్నాఫ్ కుత్తా బాబు బీహార్ లో!!
'డాగ్ బాబు' అనే పేరుగల ఒక గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ చేశారు.
బీహార్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. 'డాగ్ బాబు' అనే పేరుగల ఒక గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ చేశారు. బీహార్‌లోని మసౌర్హి డివిజన్‌లో జులై 24వ తేదీతో ఉన్న నివాస ధ్రువీకరణ పత్రంలో శునకం పేరు 'డాగ్ బాబు'గా నమోదు చేశారు. అలాగే దాని తండ్రి పేరుగా 'కుత్తా బాబు', తల్లి పేరుగా 'కుతియా దేవి' అని ఉంది. ఈ సర్టిఫికేట్‌పై డిజిటల్ రూపంలో ఉండగా, దానిపై రెవెన్యూ అధికారి సంతకం కూడా ఉంది. ఈ పత్రం బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా వెంటనే స్పందించిన అధికారులు ఈ సర్టిఫికేట్‌ను రద్దు చేశారు.