మన దేశానికి 0 మైలు రాయి ఎక్కడుందో తెలుసా?

గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు మాత్రమే కాదు భారత దేశానికి కూడా సున్నా మైలు రాయి ఉందని తెలుసా?

Update: 2025-07-26 10:30 GMT

India

గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు మాత్రమే కాదు భారత దేశానికి కూడా సున్నా మైలు రాయి ఉందని తెలుసా? దీన్ని చూడాలంటే మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ కు వెళ్ళాలి. అక్కడ మన దేశానికి జీరో మైలురాయి ఉంటుంది. ఆంగ్లేయుల పాలన సమయంలో 1907లో దేశవ్యాప్తంగా భూభౌతిక సర్వే చేశారు. అప్పటికే పెద్దనగరాలుగా ఉన్న ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, కోచి, పుణెలకు నాగ్‌పుర్‌ మధ్యస్థానంలో ఉంటుందని ఇక్కడి నుండి లెక్కగట్టారు. అక్కడే జీరో మైలురాయిని ఏర్పాటు చేసి, పలు నగరాలకున్న దూరాన్ని రాశారు. పక్కన ఆరున్నర మీటర్ల ఎత్తుతో ఎరుపు రాయితో స్తూపాన్ని నిర్మించారు. దానికి సమీపంలోనే రాతితో చెక్కిన నాలుగు గుర్రాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానికి ముందు దేశంలో ఎక్కడి దూరాన్ని కొలవాలన్నా దీన్నే ఆధారంగా చేసుకునేవారు.

Tags:    

Similar News