ఐరన్ బీమ్ గురించి తెలుసా?
శత్రు దేశాల యుద్ధ విమానాలపై క్షిపణులను ప్రయోగించకుండా నేరుగా లేజర్ కాంతిపుంజాన్ని ప్రయోగించి విమానాలను నేలకూల్చే వ్యవస్థను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది.
IronBeam
శత్రు దేశాల యుద్ధ విమానాలపై క్షిపణులను ప్రయోగించకుండా నేరుగా లేజర్ కాంతిపుంజాన్ని ప్రయోగించి విమానాలను నేలకూల్చే వ్యవస్థను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది. దీనిని ఐరన్‌బీమ్ అని పేరు పెట్టింది. ఇప్పటికే ఇజ్రాయెల్ కు ఐరన్‌డోమ్ ఉండగా, దానికి తోడుగా ఇప్పుడు ఐరన్‌బీమ్ వ్యవస్థ తోడైందని ఇజ్రాయెల్ రక్షణవర్గాలు ప్రకటించాయి. ఐరన్‌బీమ్‌ను ఒకసారి ఉపయోగిస్తే కేవలం 2 డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది. మెరుపువేగంతో అమితమైన విద్యుత్‌ను ఉపయోగించుకుని కొత్త కాంతిపుంజాన్ని ఐరన్ బీమ్ వదులుతుంది. ఏ పాయింట్ వద్ద తాకుతుందో అక్కడే విమానం, డ్రోన్, క్షిపణి ముక్కలు అవుతుంది.