మొక్కలు.. కీటకాలు మాట్లాడుకుంటాయ్ తెలుసా?
మొక్కలకు ప్రాణం ఉంటుందని ప్రతి ఒక్కరికీ తెలిసిందే!! అయితే మొక్కలకు, కీటకాలకు మధ్య కమ్యూనికేషన్ కూడా ఉంటుందట.
tree
మొక్కలకు ప్రాణం ఉంటుందని ప్రతి ఒక్కరికీ తెలిసిందే!! అయితే మొక్కలకు, కీటకాలకు మధ్య కమ్యూనికేషన్ కూడా ఉంటుందట. మొక్కల 'మాటలను' కీటకాలు అర్థం చేసుకోగలవని ఓ తాజా పరిశోధన వెల్లడించింది. ప్రకృతిలో ఉన్న ధ్వనిపరమైన సమాచార వ్యవస్థలపై ఇజ్రాయెల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఆడ చిమ్మటలు తమ గుడ్లను టమాటో మొక్కల మీద పొదుగుతుంటాయి. అయితే, ఆరోగ్యవంతమైన టమాటో మొక్కను గుర్తించటానికి ఆడ చిమ్మటలు ధ్వనితరంగాల మీద ఆధారపడుతుంటాయి. నీళ్లు లేక ఇబ్బందులు పడే టమాటో మొక్కలు తమ పరిస్థితిని ఆల్ట్రా సోనిక్ సంకేతాల ద్వారా తెలుపుతుంటాయి. దీంతో ఆరోగ్యంగా ఉన్న టమాటో మొక్క మీద మాత్రమే తమ గుడ్లను పొరుగుతాయని ఈ పరిశోధనల్లో తెలిసింది.