డికీ బర్డ్ అస్తమయం
క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు డికీ బర్డ్. ప్రఖ్యాత అంపైర్ హెరాల్డ్ డెన్నిస్ డికీ బర్డ్ 92 ఏళ్ల వయసులో తన ఇంట్లో తుది శ్వాస విడిచారు.
క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు డికీ బర్డ్. ప్రఖ్యాత అంపైర్ హెరాల్డ్ డెన్నిస్ డికీ బర్డ్ 92 ఏళ్ల వయసులో తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. 70 నుంచి 90వ దశకంలో డికీ బర్డ్ పేరు మారు మ్రోగింది. దిగ్గజ అంపైర్‌గా క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు అసామాన్యం. 1973 నుంచి 1996 వరకు మొత్తం 66 టెస్టులు, 69 వన్డేల్లో ఆయన అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1996 లార్డ్స్ లో అంపైర్‌గా ఆయనకు చివరి టెస్ట్. డికీ బర్డ్ యార్క్‌షైర్ కౌంటి క్రికెట్ క్లబ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. 93 మ్యాచ్‌లు ఆడి 3,314 పరుగులు చేశాడు. డికీ బర్డ్ మృతి పట్ల క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.