ముందే హెచ్చరిస్తుంది.. దామిని లైట్నింగ్‌ యాప్

పిడుగు ప్రమాదాన్ని అరగంట ముందే గుర్తించేందుకు ‘దామిని లైట్నింగ్‌’ మొబైల్‌ యాప్‌ ఉందనే విషయం చాలా మందికి తెలియదు.

Update: 2025-08-20 11:30 GMT

పిడుగు ప్రమాదాన్ని అరగంట ముందే గుర్తించేందుకు ‘దామిని లైట్నింగ్‌’ మొబైల్‌ యాప్‌ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. పూణే కేంద్రంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ దీన్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 83 చోట్ల ప్రత్యేక సెన్సార్లను అమర్చడంతో ముందే పిడుగు ప్రమాదాన్ని పసిగట్టే అవకాశం లభిస్తోంది. ఫోన్లో దామిని లైటింగ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని పేరు, మొబైల్‌ నంబరు, అడ్రస్, పిన్‌కోడ్‌తో రిజిస్టర్‌ చేసుకోవాలి. జీపీఎస్‌ లొకేషన్‌ తెలుసుకునేందుకు యాప్‌కు అనుమతివ్వాలి. మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందో లేదో తెలుసుకునేందుకు వీలుగా మూడు రంగులను చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరున్నచోట ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తుంది. మీరున్న ప్రాంతంలో మరో ఏడు నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే ఆ సర్కిల్‌ ఎరుపు రంగులోకి మారుతుంది. పసుపు రంగు మరో 10 నుండి 15 నిమిషాల్లో పిడుగుపడే అవకాశముంటే సర్కిల్‌ పసుపు రంగులోకి మారుతుంది. 15 నుండి 25 నిమిషాల్లో పిడుగుపడే అవకాశముంటే ఆ సర్కిల్‌ నీలం రంగులోకి మారిపోతుంది.

Tags:    

Similar News