జేసీబీతో పప్పు వండారు
జేసీబీతో ఏదైనా పని జరుగుతూ ఉందంటే చాలు.. చూడడానికి ఎగబడుతూ ఉంటాం.
JCB
జేసీబీతో ఏదైనా పని జరుగుతూ ఉందంటే చాలు.. చూడడానికి ఎగబడుతూ ఉంటాం. అలాంటిది జేసీబీతో ఏకంగా పప్పు కలిపేశారు. భారీ పాత్రలో ఉడుకుతున్న పప్పును జేసీబీతో కలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అదే పప్పును అదే జేసీబీతో ట్రాక్టర్ ట్రాలీలోకి ఎత్తి, వేలాది మంది అతిథులకు కూడా వడ్డించారు. నీరాజాద్ అనే వ్యక్తి దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. మట్టిని తవ్వడానికి వాడే యంత్రాన్ని వంటలు వండే ప్రదేశం దాకా తీసుకురావడమే పెద్ద తప్పని పలువురు విమర్శిస్తూ ఉన్నారు.