వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ట పనోలీ అరెస్ట్

పూణెకు చెందిన షర్మిష్ట పనోలి అనే లా స్టూడెంట్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2025-06-01 08:41 GMT

పూణెకు చెందిన షర్మిష్ట పనోలి అనే లా స్టూడెంట్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ సింధూర్’పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా డిలీట్ చేశారు. ఒక మతాన్ని టార్గెట్ చేసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.

అయితే తాను చేసిన వ్యాఖ్యలపై, పెట్టిన పోస్టులపై షర్మిష్ట సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా కోరింది. ఆమెకు లీగల్ నోటీసులను పలుమార్లు పంపినప్పటికీ ఆమె, ఆమె కుటుంబం ఆ నోటీసులపై స్పందించలేదు. పోలీసులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News