మన సూర్యను పందితో పోల్చి!!
ఆసియా కప్ లో భారత జట్టు చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పెద్దలు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు.
ఆసియా కప్ లో భారత జట్టు చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పెద్దలు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై అసభ్యపదజాలం వాడాడు. పాకిస్థాన్ టెలివిజన్ సమా టీవీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమానికి హాజరైన మహ్మద్ యూసఫ్ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను 'పంది' అని సంభోదించాడు. యాంకర్ యూసఫ్‌ను సరిదిద్దేందుకు ప్రయత్నించినా కూడా అతడి తీరు మాత్రం మారలేదు. భారత్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీ ద్వారా పాకిస్థాన్‌ను హింసించి గెలవడానికి ప్రయత్నిస్తున్నారన్నాడు యూసఫ్.