జెట్ విమానంలో రామ్మోహన్ నాయుడు
బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక ఏరో ఇండియా 2025 ఈవెంట్
బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక ఏరో ఇండియా 2025 ఈవెంట్‌లో భాగంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్‌నాయుడు జెట్ విమానంలో ప్రయాణించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన స్వదేశీ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ హెచ్‌జెటి-36 'యషాస్' లో మంత్రి ప్రయాణం చేశారు.
ఏరో ఇండియా-2025 ఎయిర్ షో లో యుద్ధవిమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్ఏఎల్ సంస్థ దేశీయంగా తయారుచేసిన ఈ హెచ్ జేటీ-36 యశస్ అనే జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు.