దోమ సైజులో డ్రోన్ ను తీసుకొచ్చిన చైనా
చైనా దోమ సైజులో ఉండే అతిచిన్న డ్రోన్‌ను ఆవిష్కరించింది.
చైనా దోమ సైజులో ఉండే అతిచిన్న డ్రోన్‌ను ఆవిష్కరించింది. చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఈ బుల్లి డ్రోన్‌ను సైనిక కార్యకలాపాలు, నిఘా అవసరాలకు ఉపయోగించనున్నారు. 0.6 సెంటీమీటర్లతో చిన్న కీటకం సైజులో ఉంటుంది. నల్లటి కర్ర లాంటి శరీరం, ఆకుల ఆకారంలో ఉండే రెక్కలు, తీగల్లాంటి కాళ్లతో అచ్చం దోమలా ఉంటుంది. రహస్య మిషన్ల కోసం రూపొందించిన ఈ డ్రోన్ ను గుర్తించడం కష్టం. ఇక రాడార్లు వీటిని కనిపెట్టడం కూడా కష్టమే. చైనా శాస్త్రవేత్తలు దాని బాడీ లో కమ్యూనికేషన్ గేర్, సెన్సర్లు, పవర్ యూనిట్లు, కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ను ఏర్పాటుచేశారు. ఈ డ్రోన్ ను స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా నియంత్రించవచ్చు.