50 లక్షలు గెలుచుకున్న వడ్రంగి

కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ గేమ్ షో ఎంతో మంది జీవితాలను మలుపు తిప్పింది.

Update: 2025-09-22 10:45 GMT

కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ గేమ్ షో ఎంతో మంది జీవితాలను మలుపు తిప్పింది. తాజాగా ఓ వడ్రంగి జీవితాన్ని కూడా ఈ గేమ్ షో మార్చేసింది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ యువకుడు 50 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. హుస్సేన్‌పుర్‌కు చెందిన చందర్‌పాల్‌ ఓ వడ్రంగి. కేబీసీలో అడుగుపెట్టాలని ఐదేళ్లుగా ప్రయత్నించి చివరకు హాట్‌సీట్‌ను చేరుకున్నాడు. పలు కఠిన ప్రశ్నలకు ఆడియన్స్‌ పోల్, 50-50 వంటి లైఫ్‌లైన్లను వాడుకొని 50 లక్షలను కైవసం చేసుకున్నాడు. తనకు వచ్చిన ఈ డబ్బును పిల్లల చదువుతోపాటు తన వ్యాపార విస్తరణకు ఉపయోగిస్తానన్నాడు చందర్‌పాల్‌.

Tags:    

Similar News