బకెట్ చీరమేను 14000

దీపావళి ముందు దశమి, ఏకాదశ రోజుల్లో గోదావరి, సముద్ర సంగమ ప్రాంతంలో అరుదైన చేప చీరమేను లభిస్తుంది.

Update: 2025-10-17 09:30 GMT

దీపావళి ముందు దశమి, ఏకాదశ రోజుల్లో గోదావరి, సముద్ర సంగమ ప్రాంతంలో అరుదైన చేప చీరమేను లభిస్తుంది. దీనిని కొనుగోలు చేసేందుకు మాంసాహార ప్రియులు ఆసక్తి చూపించారు. ఒక బకెట్ చీరమేను ధర 14 వేల రూపాయలు పలికింది. యానాం రేవు వద్ద జరిగిన వేలంలో 10 లీటర్ల బకెట్‌ చీరమేను 14 వేల రూపాయల వరకు అమ్ముడైంది. ఒక్క రోజులోనే 10 లక్షలకు పైగా వ్యాపారం జరిగినట్లు సమాచారం. పెద్దదారం సైజులో ఉండే చీరమేనును మత్స్యకారులు లీటర్ల లెక్కన విక్రయిస్తారు. మరో వారం రోజుల పాటు చీరమేను లభ్యమవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ చీరమేనుకు మసాలా దట్టించి వేపుడుగా చేస్తారు. అలాగే చింతకాయ తొక్కుతో కూరగా కూడా వండుకుంటారు.

Tags:    

Similar News