బ్లాక్ ప్యాంథర్.. రోడ్డు మీదకొచ్చింది
తమిళనాడులో చిరుత పులులు, బ్లాక్ ప్యాంథర్ కలిసి తిరగడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు.
తమిళనాడులో చిరుత పులులు, బ్లాక్ ప్యాంథర్ కలిసి తిరగడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. జులై 16వ తేదీన అర్థరాత్రి రెండు గంటల సమయంలో రెండు చిరుత పులులు, ఒక బ్లాక్ ప్యాంథర్ నీలగిరి అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఊరిలోకి వచ్చాయి. సిమెంట్ రోడ్డుపై తిరుగుతూ కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కన అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మూడింటినీ ఓకే చోట చూస్తుంటే అద్భుతంగా ఉందని పలువురు జంతు ప్రేమికులు పోస్టులు పెట్టారు.