ప్రకటనల్లో బాద్ షా.. మహీ హవా!!

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు ఉన్న క్రేజ్ ను పలు బ్రాండ్స్ క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి.

Update: 2025-09-05 11:45 GMT

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కు ఉన్న క్రేజ్ ను పలు బ్రాండ్స్ క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి. టీవీ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించిన సెలబ్రిటీగా షారుఖ్ ఖాన్ నిలవగా, ఆ తరువాతి స్థానంలో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోని ఉన్నారు. టీఏఎం మీడియా రీసెర్చ్‌కు చెందిన యాడ్‌ఎక్స్‌ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2025 జనవరి–జూన్‌ కాలంలో ప్రసారం అయిన టెలివిజన్‌ ప్రకటనలలో షారూక్‌ ఖాన్‌ 8 శాతం వాటాతో అత్యధికంగా కనిపించిన సెలెబ్రిటీగా మొదటి స్థానంలో ఉన్నారు. రోజుకు అన్ని చానెళ్లలో కలిపి సగటున ఆయన 27 గంటలు వీక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. 7 శాతం వాటాతో తరువాతి స్థానంలో ఎం.ఎస్‌.ధోని ఉన్నారు. సగటున రోజుకు 22 గంటలు కనిపించారు. 2025 మొదటి అర్ధభాగంలో టీవీల్లో ప్రసారం అయిన 43 బ్రాండ్ల ప్రకటనలతో ఎంఎస్‌ ధోని అగ్రస్థానంలో ఉన్నారు. షారూక్‌ 35, అమితాబ్ బచ్చన్ 28 బ్రాండ్స్‌ యాడ్స్‌లో కనిపించారు.

Tags:    

Similar News