10 ఆటో రిక్షాలను కొనే ధరకు.. ఆటోరిక్షా హ్యాండ్‌బ్యాగ్
ఆటోరిక్షా ఆకృతిలో కొత్త బ్యాగ్‌ను సిద్ధం చేసింది ప్రఖ్యాత ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ సంస్థ లూయిస్ విటన్.
అంథోరికిక్షా హ్యాండ్బ్యాగ్
ఆటోరిక్షా ఆకృతిలో కొత్త బ్యాగ్‌ను సిద్ధం చేసింది ప్రఖ్యాత ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ సంస్థ లూయిస్ విటన్. మూడు చక్రాలతో, రెండు చేతి హ్యాండిళ్లతో బ్యాగ్‌ను, అత్యంత నాణ్యమైన తోలుతో తయారుచేశారు. మెన్స్ స్ప్రింగ్- సమ్మర్ 2026 కలెక్షన్‌లో భాగంగా మెన్స్‌వేర్ విభాగ క్రియేటివ్ డైరెక్టర్ అయిన ఫారెల్ విలియమ్స్ సారథ్యంలోని బృందం ఈ ఆటోరిక్షా హ్యాండ్‌బ్యాగ్‌ను రూపొందించింది. అయితే దీని ధర వింటే మాత్రం అదిరిపోతుంది. కేవలం 35 లక్షల రూపాయలని లూయిస్ విటన్ సంస్థ తెలిపింది. అయితే ఈ బ్యాగ్ ధరతో 10 అసలైన ఆటో రిక్షాలు కొనొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.