150 ఏళ్ళు బతకొచ్చంటూ ఆరా!!

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది.

Update: 2025-09-04 11:45 GMT

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. మనుషులు 150 ఏళ్ల వరకు జీవించవచ్చని ఇరువురూ మాట్లాడుకున్నారు. ప్రపంచయుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బీజింగ్‌లో ఆయుధ ప్రదర్శన చేపట్టింది. దానిని వీక్షించేందుకు వెళ్తూ పుతిన్‌, జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన సంభాషణ లైవ్‌ స్ట్రీమ్‌ అయ్యింది. బయోటెక్నాలజీ నిరంతరం అభివృద్ధి చెందుతోందని పుతిన్‌ అనువాదకుడు అన్నారు. మానవ అవయవాల మార్పిడి జరుగుతూనే ఉంటుంది. ఎంత ఎక్కువ కాలం జీవిస్తే, నువ్వు అంత యువకుడివి అవుతుంటావు. దాంతో అమరత్వం సాధిస్తావనే సంభాషణ ఆయన నోటి నుంచి వినిపించింది. దీనిపై జిన్‌పింగ్‌ స్పందిస్తూ ఈ శతాబ్దంలో ప్రజలు 150 ఏళ్లు జీవించవచ్చనే అంచనా ఉందన్నారు.

Tags:    

Similar News