జవాన్ పై దాడి.. 20 లక్షల ఫైన్
ఆర్మీ జవాన్ పై టోల్‌గేట్ సిబ్బంది విచక్షణారహితంగా దాడిచేసి, గాయపరిచిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఆర్మీ జవాన్ పై టోల్‌గేట్ సిబ్బంది విచక్షణారహితంగా దాడిచేసి, గాయపరిచిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కపిల్ కవాడ్ అనే వ్యక్తి రాజ్‌పుత్ రెజిమెంట్‌లో సైనికుడిగా పని చేస్తున్నారు. సెలవులకు ఉత్తరప్రదేశ్ వచ్చిన ఆయన ఆదివారం రాత్రి తిరిగి శ్రీనగర్‌కు బయల్దేరారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన దిల్లీ విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో మేరఠ్‌లోని భూని టోల్‌గేట్ వద్ద వాహనాలను ముందుకు పంపడంలో అక్కడి సిబ్బంది ఆలస్యం చేస్తుండడాన్ని గుర్తించి ప్రశ్నించారు. వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహంతో టోల్‌గేట్ సిబ్బంది కపిల్‌ను స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై నేషనల్ హైవే అథారిటీ కఠిన చర్యలు తీసుకుంది. టోల్ వసూలు సంస్థ అయిన మెస్సర్స్ ధరమ్ సింగ్ అండ్ కంపెనీపై 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో టోల్ ప్లాజా బిడ్డింగ్‌లో పాల్గొనకుండా నిరోధించే ప్రక్రియను ప్రారంభించింది.