ఎయిర్ టెల్ వాడుతున్నారా.. మీకో గుడ్ న్యూస్
ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అది కూడా 17000 రూపాయల విలువైన గుడ్ న్యూస్.
ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అది కూడా 17000 రూపాయల విలువైన గుడ్ న్యూస్. ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ పెర్‌ప్లెక్సిటీ ప్రో ప్రీమియం సేవలను అందించనుంది. 36 కోట్ల మంది చందాదారులకు ఏడాది పాటు ఉచితంగా ఈ సేవలను అందించనుంది. పెర్‌ప్లెక్సిటీ ఎయిర్ టెల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ అయిన పెర్‌ప్లెక్సిటీ ప్రో, వినియోగదారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది. సెర్చ్ ఫీచర్లతో పెర్‌ప్లెక్సిటీ ఉచిత సేవలు ఇస్తోంది. అయితే ప్రో వెర్షన్‌లో నిపుణులు, ఇతర వినియోగదారులకు అధునాతన సామర్థ్యాలను అందించనుంది. ఏడాది పాటు ఎయిర్‌టెల్ ఖాతాదారులు 17,000 రూపాయలు విలువైన పెర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.