ఆన్ లైన్ లో అనుపమకు వేధింపులు
నటి అనుపమ పరమేశ్వరన్ కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
నటి అనుపమ పరమేశ్వరన్ కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అనుపమ గురించి అసత్య ప్రచారం ఓ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా సాగుతోంది. అనుపమతో పాటు ఆమె ఫ్యామిలీ, స్నేహితులు, సహ నటులే లక్ష్యంగా ట్యాగ్ చేస్తూ ఆ ఖాతాలో పోస్టులున్నాయి. మార్ఫింగ్ చేసిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఆమెను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఆన్‌లైన్ వేధింపులపై కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా అనుపమ సోషల్ మీడియాలో వెల్లడించింది. అధికారులు ఈ చర్యల వెనుక ఉన్న వ్యక్తిని కనిపెట్టారు. తమిళనాడుకు చెందిన 20ఏళ్ల యువతి ఇదంతా చేసినట్లు తెలియడంతో ఆశ్చర్యపోయానని అనుపమ తెలిపింది. ఆమెది చిన్న వయసు కావడంతో, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పూర్తి వివరాలు పంచుకోవాలనుకోవడం లేదని, దీనిపై న్యాయపరంగానే ముందుకెళతానని అనుపమ స్పష్టం చేసింది.