మృత్యుంజయుడికి సంబంధించిన మరో వీడియో
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడిన ఏకైక వ్యక్తి విశ్వాస్‌కుమార్ రమేశ్.
ahmedabad
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడిన ఏకైక వ్యక్తి విశ్వాస్‌కుమార్ రమేశ్. ప్రమాదం అనంతరం ఆయన నడచుకుంటూ అంబులెన్స్ ఎక్కారు. తాజాగా ఆయనకు సంబంధించి మరో వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ వస్తోన్న దృశ్యాలు ఉన్నాయి.
విమానం నివాస సముదాయాల మధ్య బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలగానే స్థానికులు భయంతో వణికిపోయారు. అదే సమయంలో తెలుపు రంగు టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి రోడ్డుపైకి రావడం గమనించారు. ఆ తర్వాత విశ్వాస్‌కుమార్ రమేశ్ శరీరంపై గాయాలు చూసి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లారు.