టికెట్ ధరలను తగ్గించిన ఎయిర్ ఇండియా
ఇండిగోలో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది.
ఇండిగోలో తలెత్తిన సంక్షోభం కారణంగా దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై భారం పడకుండా చూసేందుకు ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సమస్యల వల్ల ఇతర విమానాల టికెట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎయిర్ ఇండియా గ్రూప్ తమ రిజర్వేషన్ సిస్టమ్స్‌లో కొత్త ధరల విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ మార్పులను పూర్తి చేయగా, ఎయిర్ ఇండియా విమానాల్లో కూడా అన్ని బుకింగ్ ఛానళ్లలో కొత్త ధరలను క్రమంగా అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.