వైమానిక దళం చీఫ్ డ్యాన్స్
బాలీవుడ్ పాటకు భారత వైమానిక దళం చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్టెప్పులు వేశారు.
బాలీవుడ్ పాటకు భారత వైమానిక దళం చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్టెప్పులు వేశారు. వాయుసేన చీఫ్ ఉత్సాహంగా ‘హవన్ కరేంగే’ పాటకు డాన్స్ చేయడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అమర్ ప్రీత్ సింగ్ డాన్స్ చేస్తున్న వీడియో ఏ పార్టీలో చిత్రీకరించింది అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో పాక్‌లోని ఎయిర్‌బేస్‌లపై దాడికి వ్యూహ రచనలో ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్ర పోషించారు.