అక్రమ సంబంధాల గుట్టు బయటపెడతా: బెదిరించేస్తున్న ఏఐ

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదకరమని ఎంతో మంది నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.

Update: 2025-05-26 09:42 GMT

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదకరమని ఎంతో మంది నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఏఐ మోడల్ బెదిరింపులకు దిగింది. ఆంథ్రోపిక్ అనే సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే 'క్లాడ్ ఒపస్ 4' అనే ఏఐ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఎన్నో పనులు చేయగలదు. ఇటీవలే ఈ మోడల్‌ను డెవలపర్లు మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఏఐకి పలు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఓ డెవలపర్ ను బెదిరించింది.


భవిష్యత్తులో దీనికంటే అప్డేటెడ్ వెర్షన్‌ను తీసుకురానున్నట్లు దానికి చెప్పాడు డెవలపర్. ఈ మాటలు విన్న ఏఐ తీవ్రంగా స్పందించింది. కొత్త వెర్షన్‌ను ప్రవేశపెడితే డెవలపర్‌కు సంబంధించిన ఓ అక్రమ సంబంధం విషయాన్ని బయటపెడతానని హెచ్చరించింది. ఇది ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

Tags:    

Similar News