నాటకంలోకి వీధి కుక్క ఎంట్రీ!!

కేరళలోని మయ్యిల్‌ గ్రామంలో వీధి కుక్కల దాడులపై అవగాహన కల్పించేందుకు ఓ నాటకాన్ని ప్రదర్శించారు.

Update: 2025-10-07 13:45 GMT

streetdog

కేరళలోని మయ్యిల్‌ గ్రామంలో వీధి కుక్కల దాడులపై అవగాహన కల్పించేందుకు ఓ నాటకాన్ని ప్రదర్శించారు. ఓ బాలుడిపై కుక్క దాడి చేయడం, ఆ బాలుడు కేకలు వేసే సన్నివేశం ఉంటుంది. కుక్కలు మొరుగుతున్నట్లు, బాలుడు కేకలు వేస్తున్నట్లు ఓ రికార్డును మైక్‌లో వినిపించారు. రాధాకృష్ణన్‌ అనే కళాకారుడు నటనతో ఆకట్టుకుంటున్న సమయంలో ఓ కుక్క వచ్చి ఆయన్ను కరిచింది. నాటకాన్ని చూస్తున్న వారు ఇది కూడా నాటకంలో భాగమేనని భావించారు. అయితే రాధాకృష్ణన్‌ నొప్పితో 15 నిమిషాలపాటు ప్రదర్శనను కొనసాగించి, పూర్తి చేశారు. ఆ తర్వాతే ఆసుపత్రికి వెళ్లి, చికిత్స చేయించుకున్నారు.

Tags:    

Similar News