ఒంటరై ముంబైకు చేరిన అరుదైన పక్షి
ముంబైలో అరుదైన పక్షి కనిపించింది. ఈ పక్షి ప్రజలకు చాలా దూరంగా ఉంటూ ఉంటుంది.
ముంబైలో అరుదైన పక్షి కనిపించింది. ఈ పక్షి ప్రజలకు చాలా దూరంగా ఉంటూ ఉంటుంది. అలాంటిది ఇక్కడొచ్చి వాలింది. ఉష్ణమండల ప్రాంతాల్లో తీరానికి సుదూర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే మాస్క్డ్ బూబీ పక్షి ముంబైలోని గోరెగావ్ ఈస్ట్‌లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలోని భవానీ బిల్డింగ్‌లో వాలింది. స్థానికులు సునీల్ గుప్తా అనే వన్యప్రాణి సంరక్షకునికి దీని గురించి సమాచారమిచ్చారు. ఆయన అటవీ శాఖ అధికారులకు దాన్ని అందజేశారు. ఇవి సముద్రంలో మారుమూల దీవుల్లో, ముఖ్యంగా అరేబియా సముద్రంలో కనిపిస్తుంటాయని నిపుణులు తెలిపారు. చేపలు వీటి ఆహారం, తరచూ సమూహాలుగా సంచరిస్తుంటాయి. బలమైన గాలుల తాకిడికో లేదా దారి తప్పో ఇటుగా వచ్చి ఉంటుందని అనుమానిస్తూ ఉన్నారు.